కోనసీమ తిరుపతిగా పేరుగాంచిన తూర్పుగోదావరి జిల్లా ఆత్రేయపురం మండలం వాడపల్లి వెంకటేశ్వర స్వామిని విశాఖ శ్రీ శారదా పీఠం ఉత్తరాధికారి శ్రీ స్వాత్మానందేంద్ర సరస్వతీ దర్శించుకున్నారు. ఆలయానికి వచ్చిన స్వామి వారికి దేవాదాయ శాఖ అధికారులు ఘన స్వాగతం పలికారు. వేద పండితులు ఆయనకు పూర్ణకుంభంతో స్వాగతం పలికి.. ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి తీర్థ ప్రసాదాలు అందజేశారు. పలువురు ఆయన వద్ద నుంచి ఆశీర్వాదం తీసుకున్నారు.
వాడపల్లి వేంకటేశ్వర స్వామిని దర్శించుకున్న శ్రీ స్వాత్మానందేంద్ర సరస్వతి - తూర్పుగోదావరి జిల్లా తాజా వార్తలు
వాడపల్లి వేంకటేశ్వర స్వామిని విశాఖ శ్రీ శారదా పీఠం ఉత్తరాధికారి శ్రీ స్వాత్మానందేంద్ర సరస్వతీ దర్శించుకున్నారు. వేద పండితులు ఆయనకు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. అనంతరం స్వామి వారి తీర్థ ప్రసాదాలు అందజేశారు.
వాడపల్లి వెంకటేశ్వర స్వామి ఆలయం