శ్రీ లక్ష్మీనరసింహ స్వామి కల్యాణోత్సవాన్ని తూర్పుగోదావరి జిల్లా కోరుకొండలో వైభవంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో తితిదే ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి, మంత్రి మోపిదేవి వెంకటరమణ తదితరులు పాల్గొని.. నగరంలో నూతనంగా నిర్మించిన రథం రోడ్డును ప్రారంభించారు. కాపు కార్పొరేషన్ ఛైర్మన్ జక్కంపూడి రాజా స్వామివారి కల్యాణ మహోత్సవానికి పట్టువస్త్రాలు, ముత్యాల తలంబ్రాలు సమర్పించారు. ఈ ఉత్సవాన్ని తిలకించేందుకు భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చారు.
వైభవంగా కోరుకొండ లక్ష్మీ నరసింహ స్వామి కల్యాణం - రాజమహేంద్రవరం పార్లమెంట్ సభ్యులు మార్గాని భరత్ రామ్ తాజా వార్తలు
తూర్పుగోదావరి జిల్లా కోరుకొండలో శ్రీలక్ష్మీ నరసింహస్వామి కల్యాణోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. రాత్రి అంకురార్పణతో ప్రారంభమైన ఉత్సవాలు 11వ తేదీ రాత్రి శ్రీ పుష్పయోగంతో ముగియనున్నాయి. ఈ కార్యక్రమంలో తితిదే ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డితో పాటు మంత్రి మోపిదేవి వెంకటరమణ, రాజమహేంద్రవరం పార్లమెంట్ సభ్యులు మార్గాని భరత్, రాష్ట్ర కాపు కార్పొరేషన్ ఛైర్మన్ జక్కంపూడి రాజా తదితరులు పాల్గొన్నారు.
కోరుకొండ లక్ష్మి నరసింహ స్వామి కళ్యాణమహోత్సవం