Maha Shivratri Special Temple: మహా శివరాత్రి వస్తుంటే చాలు చిన్న పెద్ద తేడా లేకుండా శివ నామస్మరణ చేసుకుంటారు. తమ సమీపంలో ఉన్న దేవాలయానికి వెళ్లి రాత్రి పూట ఆలయంలో ఉన్న పరమేశ్వరుడిని స్మరించుకుని, జాగారం చేస్తుంటారు. ప్రతి సంవత్సరం పండుగను కొత్తగా జరుపుకోవడానికి అందరూ ఇష్టపడతారు. ఈ దేవాలయం ఆలోచనకు తగ్గట్టుగానే ఉంటుంది. ఈ సారి ఇక్కడ ఉన్నా శివ పార్వతులను దర్శించుకోవడం మరిచారో మరో సంవత్సరం వేచి ఉండాల్సిందే బాబు. మన తెలుగు రాష్ట్రాల్లో ఉన్న ఈ దేవలయాన్ని కేవలం శివరాత్రి రోజు మాత్రమే భక్తులకు అందుబాటులో ఉంచుతారు. మిగిలిన సంవత్సరమంతా మూసేస్తారు. ఈ నెల ఫిబ్రవరి 18న మహా శివరాత్రి సందర్భంగా శ్రీ కేదారేశ్వర స్వామి ఆలయానికి మీ కుటుబంతో, స్నేహితులతో వెళ్లి మీ జీవితంలో ఒక పేజీని గుర్తిండిపోయేలా చేసుకోండి మిత్రమా !
మహా దేవుడికి ప్రత్యేక పూజలు: ఏడాదికి ఒక్కసారి మాత్రమే దర్శనం లభించే అతి ప్రాచీనమైన శ్రీ కేదారేశ్వర స్వామి ఆలయంలో ఉన్న మహా దేవుడికి ప్రత్యేక పూజలు చేస్తారు. ఈ పురాతనమైన దేవాలయం తూర్పు గోదావరి జిల్లా బిక్కవోలులో కొలువై ఉంది. ఈ పర్వదినాన్ని పురస్కరించుకుని భక్తులు పెద్ద ఎత్తున పాల్గొని స్వామివారిని దర్శించుకుని ఆలయంలో అభిషేకాలు నిర్వహిస్తుంటారు. వారి మనుసులో ఉన్న కోరికలను ఆ పరమేశ్వరుడికి తెలియజేస్తారు. ఇక్కడ వెలిచిన నీలకంఠుడిని చూడడానికి భక్తలు పోటీ పడుతుంటారు.