అన్నార్తులకు అండగా నిలుస్తున్న ట్రస్ట్ - Sri Jyotirlinga Trust food distribution news
తూర్పుగోదావరి జిల్లా బండారులంకలోని శ్రీ జ్యోతిర్లింగ ట్రస్ట్ ఆధ్వర్యంలో నిరుపేదలకు అన్నదానం చేస్తున్నారు. ఏడాది కాలంగా ట్రస్ట్ అందిస్తున్న సేవలకు దాతలు ఎంతగానో సహకరిస్తున్నారని ట్రస్ట్ వ్యవస్థాపకుడు భీమేశ్వరరావు సిద్ధాంతి తెలిపారు.
అన్నార్తులకు అండగా నిలుస్తున్న ట్రస్ట్
తూర్పుగోదావరి జిల్లా అమలాపురం నియోజకవర్గం పరిధిలోని బండారులంకలో శ్రీ జ్యోతిర్లింగ ట్రస్ట్ ఏడాది కాలంగా నిరుపేదలకు అన్నదానం చేస్తుంది. గ్రామానికి చెందిన కాలెపు భీమేశ్వరరావు సిద్ధాంతి మూడేళ్ల కిందట ఇక్కడ శ్రీ జ్యోతిర్లింగ ట్రస్ట్ ఏర్పాటు చేశారు. ఏడాది నుంచి పేదలకు అన్నదానం చేస్తున్నారు. లాక్డౌన్ సమయంలో ట్రస్టు... పేదలకు మరింత ఉపయోగకరంగా నిలుస్తుంది. ట్రస్ట్ అందిస్తున్న సేవలకు దాతలు ఎంతగానో సహకరిస్తున్నారని వ్యవస్థాపకుడు భీమేశ్వరరావు సిద్ధాంతి తెలిపారు.