రాజమహేంద్రవరంలోని శ్రీ గాయత్రి నృత్య కళానికేతన్ రజతోత్సవాలు.. రెండు రోజుల పాటు ఘనంగా నిర్వహించారు. ఆనం కళాకేంద్రంలో జరిపిన ఈ కార్యక్రమానికి ఎంపీ మార్గాని భరత్ ముఖ్య అతిథిగా హజరయ్యారు. ఈ వేడుకలో ఉభయ తెలుగు రాష్ట్రాల నుంచి కళాకారులు హాజరై తమ ప్రతిభను ప్రదర్శించారు. ప్రతిభ చూపిన కళాకారులను సత్కరించారు.
ఘనంగా గాయత్రి నృత్య కళానికేతన్ రజతోత్సవాలు - శ్రీ గాయత్రి నృత్య కళానికేతన్ తాజా సమాచారం
రాజమహేంద్రవరంలోని ఆనం కళాకేంద్రంలో నాట్యకళ తరంగం కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. శ్రీ గాయత్రి నృత్య కళానికేతన్ 25 వసంతాలు పూర్తి చేసుకున్నందున ఈ వేడుకను నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఎంపీ మార్గాని భరత్ ముఖ్య అతిథిగా హజరయ్యారు.
![ఘనంగా గాయత్రి నృత్య కళానికేతన్ రజతోత్సవాలు Sri Gayatri Nrusthaya Kalaniketan](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-10821824-45-10821824-1614583951926.jpg)
ఘనంగా గాయత్రి నృత్య కళానికేతన్ రజతోత్సవాలు