కేంద్రపాలిత ప్రాంతమైన యానాంలో కరోనా నియంత్రణకు అధికారులు చర్యలు చేపట్టారు. యానాం ప్రభుత్వ అతిథి గృహంలో కరోనా సోకినట్టుగా అనుమానిస్తున్న 16 మందిని.. 21 రోజులపాటు డాక్టర్ల పర్యవేక్షణలో పరిశీలించిన అనంతరం వారిని ఇంటికి తరలించారు. వీరితో పాటు 726 మందిని గృహ నిర్బంధంలో ఉంచి ఎప్పటికప్పుడు వారి ఆరోగ్య పరిస్థితిని సమీక్షిస్తున్నారు. ప్రతి గ్రామం, పట్టణాల్లో... ఉదయం, సాయంత్రం వైరస్ నాశక రసాయనాలను పిచికారీ చేస్తున్నారు.
రోజుకు 2 సార్లు రసాయనాల పిచికారీ - lockdown in yanam
తూర్పు గోదావరి జిల్లాలో కరోనా కేసులు 12 కు చేరాయి. జిల్లాలో అంతర్భాగంగా ఉన్న కేంద్ర పాలిత ప్రాంతం యానంలో మరింత కట్టుదిట్టమైన రక్షణ చర్యలను అధికారులు చేపట్టారు. 726 మందిని గృహ నిర్బంధంలో ఉంచి పరిస్థితులను సమీక్షిస్తున్నారు.
యానాంలో రెండు సార్ల రసాయనాల పిచికారి