కేంద్రపాలిత ప్రాంతం యానాంలో జీఎంసీ బాలయోగి, వైఎస్సార్ ఇంటర్నేషనల్ క్రీడా ప్రాంగణాలు క్రీడాకారులతో కళకళలాడుతున్నాయి. 8 నెలల సుదీర్ఘ విరామానంతరం ఉదయం, సాయంత్రం 5 గంటల నుంచి 8 గంటల వరకు సాధన చేసేందుకు క్రీడాకారులకు అనుమతిచ్చారు. రాష్ట్ర, జాతీయ స్థాయి పోటీల్లో పాల్గొనే క్రీడాకారులందరూ కొవిడ్ నిబంధనలు పాటిస్తూ కోచ్ల పర్యవేక్షణలో శిక్షణ పొందుతున్నారు.
యానాంలో కళకళలాడుతున్న క్రీడా ప్రాంగణాలు - తూర్పుగోదావరి జిల్లా తాజా వార్తలు
కేంద్ర ప్రభుత్వం నిర్దేశించిన ఆదేశాల మేరకు క్రీడా ప్రాంగణాలు, వ్యాయమ కేంద్రాలు ఒక్కొక్కటిగా తెరుచుకుంటున్నాయి. పరిస్థితులకనుగుణంగా అధికారులు..క్రీడాకారులను సాధన కొరకు అనుమతిస్తున్నారు.
యానాంలో కళకళలాడుతున్న క్రీడా ప్రాంగణాలు