తూర్పుగోదావరి జిల్లా తుని పురపాలక సంఘ కార్యాలయంలో రూ. లక్షలు వెచ్చించి కొనుగోలు చేసిన క్రీడా సామగ్రి నిరుపయోగంగా ఉంది. కొండవారిపేట పార్కులో చిన్నారులు ఆడుకునేందుకు పలు రకాల ఆట వస్తువులు కొనుగోలు చేశారు. ఏడాది కాలంగా వాటిని అందుబాటులోకి తీసుకురాకపోవడం వల్ల కార్యాలయం ఆవరణలో వృథాగా పడి వున్నాయి. అధికారులు స్పందించి వీటిని పార్క్ లో అమర్చి అందుబాటులోకి తీసుకురావాలని ప్రజలు కోరుతున్నారు.
నిరూపయోగంగా క్రీడా సామాగ్రి..అధికారులు స్పందించాలని విజ్ఞప్తి - tuni in east godavari district
లక్షలు వెచ్చించి పార్కు కోసం కొనుగోలు చేసిన క్రీడా సామాగ్రి తూర్పు గోదావరి జిల్లా తుని పురపాలక సంఘ కార్యాలయంలో నిరూపయోగంగా పడి ఉన్నాయి. వాటిని వినియోగంలోకి తీసుకొస్తే పిల్లలకు ఎంతో ఉపయోగకరమని ప్రజలంటున్నారు.
నిరూపయోగంగా క్రీడా సామాగ్రి