తూర్పుగోదావరి జిల్లా కాకినాడలోని చేయూత స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో బాలల దినోత్సవం సందర్భంగా ఆత్మీయ స్పర్శ కార్యక్రమం నిర్వహించారు. స్థానిక గీతం కళాశాలలో ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమానికి జిల్లా నలుమూలల నుంచి హెచ్ఐవీ పీడిత చిన్నారులు హాజరయ్యారు.
వారికి సంస్థ ప్రతినిధులు దుస్తులు, పౌష్టికాహారం ప్యాకెట్లు, పండ్లు అందించారు. పలువురి చిన్నారుల పుట్టిన రోజు వేడుకలను నిర్వహించారు. పిల్లల చదువుకు చేయూత అందిస్తున్నట్లు వెల్లడించారు.