తూర్పు గోదావరి జిల్లా పి.గన్నవరం మండలం బెల్లంపూడిలో ప్రధాన రహదారి పక్కనే ఉన్న అంబేద్కర్ విగ్రహం స్లాబ్ కింద 70 సంవత్సరాల వయస్సు గల వృద్ధురాలు మూడు నెలలుగా ఎండ, వానలను తట్టుకొని అక్కడే ఉంటోంది. ఆమె పరిస్థితి గమనించి స్థానికులు ఆహారం అందిస్తున్నారు. ఊరి, పేరు అడిగితే అమలాపురం అని తన పేరు చల్ల సత్యవతి అని ఒక కుమారుడు ఉన్నాడు అని చెబుతోంది. భర్త చనిపోయాడని చెబుతుంది. అంతకు మించి ఏ ఒక్క ప్రశ్న అడిగినా.. చిరునవ్వుతో మౌనంగా ఉంటోంది. మానవతావాదులు పట్టించుకుని ఏదైనా వృద్ధాశ్రమంలో చేర్పిస్తే ఆమెకు మేలు చేసినవారౌతారని స్థానికులు అభిప్రాయపడుతున్నారు.
NEED HELP: సాయం కోసం వృద్ధురాలి ఎదురుచూపులు..
భర్త మరణించాడు. కన్నకొడుకు కాదన్నాడా.. లేక అతనికి కష్టమెందుకులే అని తానే బయటకు వచ్చిందో తెలియదు. ఒంటరిగా రోడ్డు పక్కనే ఓ చోట తలదాచుకుంది ఆ తల్లి. ఎవరైనా ఆప్యాయంగా పట్టెడన్నం పెడితే తింటుంది. లేదంటే పస్తే. ప్రకృతితో స్నేహం చేస్తూ ఎండా, వానను తట్టుకొని అక్కడే కాలం గడుపుతోంది. ఇంత గడ్డుపరిస్థితుల్లోనూ.. ఎక్కడా ఆమె చిరునవ్వు చెరగటం లేదు. ఎవరు వెళ్లి పలకరించినా.. నవ్వుతూ సమాధానం చెబుతోంది. ఆమె ఆత్మస్థైర్యాన్ని చూసిన చుట్టు పక్కల ప్రజలు ప్రశంసిస్తున్నారు.
వృద్ధురాలు