తూర్పుగోదావరి జిల్లా రాజోలు నియోజకవర్గంలో వాహనాలపై పోలీసులు స్పెషల్ డ్రైవ్ నిర్వహించారు. అమలాపురం డీఎస్పీ మాధవ రెడ్డి, స్థానిక సీఐ ఆధ్వర్యంలో ఈ డ్రైవ్ జరిగింది. నిబంధనలు పాటించని వాహనాలపై అపరాధ రుసుము విధించి.. వసూలు చేసినట్లు పోలీసులు తెలిపారు. నంబర్ ప్లేట్ సరిగా లేని, వాహన పరిమితికి మించి ప్రయాణించటం, లైసెన్స్ లేకపోవటం, ఇతర నిబంధనలు పాటించని వాహనాలపై జరిమానా విధించినట్లు చెప్పారు. ఒక్కరోజు వసూళ్లు రూ.12లక్షలు పైచిలుకు అని వెల్లడించారు. ఈ డ్రైవ్లో పది మంది ఎస్సైలు, సిబ్బంది పాల్గొన్నారు.
నిబంధనలు పాటించని వాహనాలపై పోలీసుల స్పెషల్ డ్రైవ్ - Special police drive at rajole news
తూర్పుగోదావరి జిల్లా రాజోలు నియోజకవర్గంలో పోలీసులు.. స్పెషల్ డ్రైవ్ నిర్వహించారు. నిబంధనలు పాటించని వాహనాలపై అపరాధ రుసుము వసూలు చేసినట్లు అమలాపురం డీఎస్పీ తెలిపారు.
పోలీసుల స్పెషల్ డ్రైవ్