ప్రముఖ పర్యాటక కేంద్రం, కేంద్రపాలిత ప్రాంతం యానంలో పర్యాటకుల కోసం పోలీస్ శాఖ ప్రత్యేక సహాయ కేంద్రాన్ని ఏర్పాటు చేసింది. గౌతమి, గోదావరి చెంతన ఉన్న రాజీవ్ బీచ్‌లో పర్ణశాలలా.. నిర్మించిన టూరిస్ట్ పోలీస్ బూత్‌ను యానం ఎస్పీ రాజశేఖరన్, సర్కిల్ ఇన్స్పెక్టర్ శివ గణేశ్ ప్రారంభించారు. అలాగే వేసవి తాపాన్ని దృష్టిలో ఉంచుకొని పర్యాటకుల కోసం దాతలు సమకూర్చిన వాటర్‌కూలర్‌ను ప్రారంభించారు.
యానంలో పర్యాటకులకు ప్రత్యేక సహాయ కేంద్రం
కేంద్రపాలిత ప్రాంతమైన యానంలో పర్యాటకుల కోసం పోలీస్ శాఖ ప్రత్యేక సహాయ కేంద్రాన్ని ఏర్పాటు చేసింది. ఈ కేంద్రం ద్వారా పర్యాటకులకు తగు సమాచారం, సూచనలు చేసేలా చర్యలు చేపట్టారు.
ప్రత్యేక సహాయ కేంద్రం