ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

'సంఘ వ్యతిరేక కార్యక్రమాలకు పాల్పడేవారిపై ప్రత్యేక దృష్టి' - sp ravindranath babu press meet

తూర్పు గోదావరి జిల్లా కిర్లంపూడి పోలీసు స్టేషన్ లోని రికార్డులను ఎస్పీ పరిశీలించారు. సంఘ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడేవారిపై ప్రత్యేక శ్రద్ధ పెట్టినట్లు తెలిపారు. స్నేహపూర్వక పోలీసింగ్ కు ప్రాధాన్యం ఇస్తున్నట్లు పేర్కొన్నారు.

కిర్లంపూడి పోలీసు స్టేషన్ రికార్డులను తనిఖీ చేసిన ఎస్పీ
కిర్లంపూడి పోలీసు స్టేషన్ రికార్డులను తనిఖీ చేసిన ఎస్పీ

By

Published : Sep 3, 2021, 10:27 PM IST


వార్షిక తనిఖీల్లో భాగంగా ఎస్పీ రవీంద్రనాథ్ బాబు తూర్పు గోదావరి జిల్లా కిర్లంపూడి పోలీసు స్టేషన్​లో రికార్డులను తనిఖీ చేశారు. క్రైం రికార్డులు,పెండింగ్ కేసులను పరిశీలించారు. సంఘ వ్యతిరేక కార్యక్రమాలకు పాల్పడేవారిపై ప్రత్యేక దృష్టి పెట్టినట్లు తెలిపారు. లా అండ్ ఆర్డర్ పోలీసింగ్​లో అత్యంత ముఖ్యమైనదని అన్నారు. దానిని సక్రమంగా అమలు చేస్తూనే స్నేహపూర్వకమైన పోలీసు సేవలు అందిస్తున్నట్లు తెలిపారు.

సమగ్రతకు, సమస్యల సత్వర పరిష్కారానికి పోలీసులు పని చేయాలని పిలుపునిచ్చారు. మహిళల భద్రతకు అత్యంత ప్రాధాన్యతను ఇస్తున్నట్లు తెలిపారు. కొవిడ్ నియమ నిబంధనలను పాటిస్తూ స్పందనలో వచ్చే సమస్యలను వేగవంతంగా పరిష్కరిస్తామని అన్నారు. బహిరంగ ప్రదేశాల్లో మద్యం సేవించడాన్ని నియంత్రించేందుకు స్పెషల్ డ్రైవ్ నిర్వహిస్తున్నట్లు తెలిపారు. కోడిపందాలు, పేకాట వంటివాటి నియంత్రణకు గ్రామస్థాయి కమిటీలు ఎర్పాటు చేశామన్నారు. త్వరలోనే కిర్లంపూడిలో నూతన పోలీసు స్టేషన్ నిర్మాణ పనులు చేపట్టనున్నట్లు తెలిపారు.

ABOUT THE AUTHOR

...view details