ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

అనపర్తిలో ఎస్పీ కరణం కుమార్ పర్యటన - lockdown updates in east godacari

తూర్పుగోదావరి జిల్లా అనపర్తిలో జిల్లా ఎస్పీ కరణం కుమార్ పర్యటించారు. లాక్​డౌన్ సందర్భంగా ప్రజల సహకారం ప్రశంసనీయమని ఆయన అన్నారు.

SP Karan Kumar, who visited the East Godavari district
తూర్పుగోదావరి జిల్లాలో పర్యటించిన ఎస్పీ కరణం కుమార్

By

Published : Apr 8, 2020, 7:42 PM IST

గత ఐదు రోజులుగా తూర్పుగోదావరి జిల్లాలో ఒక్క కరోనా కేసూ నమోదు కాకపోవడం శుభ పరిణామమని జిల్లా అడిషనల్ ఎస్పీ కరణం కుమార్ పేర్కొన్నారు. లాక్​డౌన్ అమల్లో ఉన్నందున అనపర్తిలో రామచంద్రాపురం డీఎస్పీ రాజగోపాల్ రెడ్డితో కలిసి ఆయన పర్యటించారు. గ్రామాల్లో లాక్​డౌన్ అమలు తీరును పరిశీలించిన ఆయన... గత నెల 22 నుంచి ఈ నిబంధన కొనసాగుతున్నప్పటికీ ప్రజలు ఎంతో సమన్వయంతో వ్యవహరిస్తున్నారని అన్నారు. జిల్లాలో మూడువేల మందికి పైగా పోలీసులు, పాఠశాల పీడీలు, ఇతర సిబ్బంది 1500 మంది తమ తమ విధులు నిర్వర్తిస్తున్నారని వెల్లడించారు. లాక్ డౌన్ అమలులో జిల్లా ప్రజల సహకారం అభినందనీయమని ప్రశంసించారు.

ABOUT THE AUTHOR

...view details