తూర్పు గోదావరి జిల్లా వీరవరంలో కారుతో ఢీకొట్టిన ఘటనలో మృతి చెందిన బాలుడు శివ కుటుంబాన్ని ఎస్పీ నయీమ్ అస్మి పరామర్శించారు. బాలుడి చిత్రపటానికి ఎస్పీ, ఇతర సిబ్బంది నివాళులర్పించారు. అనంతరం మీడియాతో మాట్లాడిన ఎస్పీ "ఇదీ మాటల్లో చెప్పలేని ఘోరం. తండ్రి, కొడుకులను కారుతో ఢీకొనటమే కాకుండా.. రాడ్తో దాడి చేయటం దారుణం. హంతకున్ని కఠినంగా శిక్షించేలా చర్యలు తీసుకొంటాం. అలాగే కుటుంబానికి ప్రభుత్వ పరంగా న్యాయం జరిగేలా చూస్తాం" అని ఎస్పీ అన్నారు.
మృతి చెందిన బాలుడి కుటుంబాన్ని పరిశీలించిన ఎస్పీ - Latest information on the murder of a boy in Veeravaram
తూర్పు గోదావరి జిల్లా కిర్లంపూడి మండలం వీరవరంలో పకోడి బండిని కారుతో ఢీకొట్టి ఘటనలో మృతి చెందిన బాలుడి కుటుంబాన్ని ఎస్పీ నయీమ్ అస్మి పరామర్శించారు. బాధితుడి కుటుంబానికి న్యాయం చేస్తానని హామీ ఇచ్చారు.
ఎస్పీ నయీమ్ అస్మి