ఉపాధి కోసం ఊరు వదిలి ద్విచక్రవాహనంపై వెళుతున్న తల్లికొడుకులను తూర్పుగోదావరి జిల్లా ప్రత్తిపాడు వద్ద జాతీయ రహదారిపై గుర్తు తెలియని వాహనం ఢీకొంది. ఘటనలో విశాఖ జిల్లా నర్సీపట్నం వద్ద కొరిమిల్లి గ్రామానికి చెందిన గణేష్ అక్కడిక్కడే మృతి చెందాడు. తల్లి మంగ తీవ్ర గాయాలతో ప్రతిపాడు ఆసుపత్రిలో చికిత్స పొందుతోంది. బిడ్డ చనిపోయిన విషయం తెలియని తల్లి బిడ్డ గురించి అందరినీ అడుగుతోంది.
ద్విచక్రవాహనాన్ని ఢీకొన్న గుర్తు తెలియని వాహనం - pratipadu
తూర్పుగోదావరి జిల్లా ప్రత్తిపాడు వద్ద జాతీయ రహదారిపై గుర్తు తెలియని వాహనం ద్విచక్రవాహనాన్ని ఢీకొట్టింది. దీంతో దానిపై ప్రయాణిస్తున్న తల్లి, బిడ్డకు గాయలైనాయి. వాహనం నడుపుతున్న గణేష్ అక్కడికక్కడే చనిపోగా... తల్లి ప్రతిపాడు ఆసుపత్రిలో చికిత్స పొందుతోంది
ద్విచక్రవాహనాన్ని ఢీకొన్న గుర్తు తెలియని వాహనం