పోలవరం ప్రాజెక్ట్ నిర్మాణం విషయంలో గత ప్రభుత్వ విధానాన్నే ప్రస్తుతం వైకాపా అనుసరిస్తోందని భాజపా రాష్ట్ర ఆధ్యక్షుడు సోము వీర్రాజు ఆరోపించారు. నిర్మాణంలో జరిగిన అవకతవకలపై ముఖ్యమంత్రి జగన్ విచారణ ఎందుకు జరిపించడం లేదని ప్రశ్నించారు. పోలవరం ప్రాజెక్ట్ నిర్మాణానికి భాజపా కట్టుబడి ఉందని రాజమహేంద్రవరంలో మరోసారి స్పష్టం చేశారు.
'పోలవరం ప్రాజెక్టు నిర్మాణానికి భాజపా కట్టుబడి ఉంది' - పోలవరం ప్రాజెక్టు నిర్మాణంపై భాజపా రాష్ట్ర ఆధ్యక్షుడు సోము వీర్రాజు వాఖ్యలు
పోలవరం ప్రాజెక్ట్ నిర్మాణానికి భాజపా కట్టుబడి ఉందని రాజమహేంద్రవరంలో మరోసారి సోము వీర్రాజు స్పష్టం చేశారు. హిందూ ధర్మ ప్రచారానికి వైకాపా ప్రభుత్వం 500 కోట్ల రూపాయలు కేటాయించాలని డిమాండ్ చేశారు.
మీడియా సమావేశంలో సోము వీర్రాజు
పేదలకు 30 లక్షల పట్టాలు ఇస్తామని ప్రభుత్వం చెబుతోందని.. కానీ భూముల కొనుగోలులో విచ్చలవిడి అవినీతి జరిగిందని సోము వీర్రాజు ఆరోపించారు. తూర్పు గోదావరి జిల్లాలో ఆవ భూముల కొనుగోళ్లే దీనికి ఉదాహరణ అని తెలిపారు. హిందూ ధర్మ ప్రచారానికి రాష్ట్ర ప్రభుత్వం 500 కోట్ల రూపాయల నిధులు కేటాయించాలన్న ఆయన.. లేని పక్షంలో ఉద్యమిస్తామని హెచ్చరించారు.
ఇవీ చూడండి: