Somu Veerraju On Liquor Prices:అధికారంలోకి వస్తే లిక్కర్‌ను రూ. 70కే విక్రయిస్తామంటూ తాను చేసిన వ్యాఖ్యలను భాజపా రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు సమర్థించుకున్నారు. పేదవాడిని దృష్టిలో పెట్టుకునే తాను ఆ వ్యాఖ్యలు చేశానన్నారు. రూ. 6 బాటిల్‌ను రూ. 200 లకు అమ్మటాన్ని భాజపా ప్రోత్సహించదని వ్యాఖ్యనించారు. పేదల కోసం చీప్ లిక్కర్‌ను రూ. 50 కే అమ్మాలని డిమాండ్ చేశారు. రూ. 50కి చీప్ లిక్కర్ అమ్మితే కుటుంబానికి ఏడాదికి రూ. 2 లక్షలు మిగులుతాయన్నారు. తనను సారాయి వీర్రాజు అన్నవారు ఏం తాగుతారో తనకు తెలుసునని ఎద్దేవా చేశారు.
గుంటూరు జిన్నా టవర్ పేరు మార్చాల్సిందేనని సోము డిమాండ్ చేశారు. తాము అధికారంలోకి వచ్చాక.. జిన్నా టవర్ పేరు మారుస్తామన్నారు. విశాఖ కింగ్ జార్జ్ ఆస్పత్రి పేరును కూడా మార్చాలన్నారు.
వైరల్‌గా మారిన సోమూ వ్యాఖ్యలు..