రాష్ట్రంలో తెదేపాకు పూర్వ వైభవం తీసుకొస్తామని తెదేపా రాష్ట్ర ఉపాధ్యక్షులు జ్యోతుల నెహ్రూ అన్నారు. తూర్పుగోదావరి జిల్లా జగ్గంపేటలో... గండేపల్లి మండలం ఎన్టీ రాజపురానికి చెందిన వివిధ పార్టీల యువకులు తెదేపా తీర్ధం పుచ్చుకోగా... వారికి కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. భూమి గుండ్రంగా ఉందన్నట్లుగా ఏ పార్టీలోకి వెళ్లినా.. తిరిగి తెదేపాలోకే రావాలని నెహ్రూ అన్నారు. తెలుగుదేశం పార్టీ రాజకీయ పరిశ్రమ అని... కార్యకర్తలు తయారవుతూనే ఉంటారని అన్నారు.
ఏ పార్టీలోకి వెళ్లినా.. తిరిగి తెదేపాలోకే రావాలి: జ్యోతుల నెహ్రూ - tdp leader jyothula nehri
తెదేపాకు రాష్ట్రంలో పూర్వవైభవం తీసుకొస్తామని తెదేపా రాష్ట్ర ఉపాధ్యక్షులు జ్యోతుల నెహ్రూ ఆశాభావం వ్యక్తం చేశారు. తూర్పుగోదావరి జిల్లా గండేపల్లి మండలం ఎన్టీ రాజపురానికి చెందిన వివిధ పార్టీల యువకులు తెదేపాలో చేరారు.
![ఏ పార్టీలోకి వెళ్లినా.. తిరిగి తెదేపాలోకే రావాలి: జ్యోతుల నెహ్రూ some youngsters from different parties joins in tdp at east goadavari district](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-9475659-394-9475659-1604826084824.jpg)
ఏ పార్టీలోకి వెళ్లిన తిరిగి తెదేపాలోకే రావాలి: జ్యోతుల నెహ్రు
TAGGED:
tdp leader jyothula nehri