మన్యంలోని ఓ తాచుపాము గురువారం ఎంచక్కా ద్విచక్ర వాహనంలోకి దూరింది. కోతులగుట్ట సామాజిక వైద్యశాలలో ఆరోగ్య మిత్రగా చేస్తున్న సర్వేశ్వరరావు విధులు ముగించుకుని కూనవరం పాఠశాలలో చదువుతున్న కుమార్తెను తీసుకుని కరకగూడెంలోని ఇంటికి బయలుదేరారు. స్కూటీపై వెళుతుండగా ఎక్సలేటర్ ఇచ్చే దగ్గర ఏదో కన్పించినట్టు అనిపించి వాహనాన్ని ఆపి వెతికారు. ఏమీ కన్పించకపోవడంతో ఇంటికెళ్లారు. తిరిగి కూనవరం వెళ్తుండగా వాహనం హ్యాండిల్ వద్ద తాచు పాము తల కనిపించడంతో ఉలిక్కిపడ్డారు. వెంటనే సమీపంలోని యువకులను పిలవడంతో వారు వచ్చి రెండు గంటలపాటు శ్రమించి సర్పాన్ని బయటకు తీసి చంపివేశారు. పెద్దప్రమాదం తప్పడంతో సర్వేశ్వరరావు ఊపిరి పీల్చుకున్నారు.
ద్విచక్ర వాహనంలో దూరిన పాము.. - రాజమహేంద్రవరంలో బైక్‌లో దూరిన పాము
తూర్పుగోదావరి జిల్లాలో ఓ పాము ద్విచక్ర వాహనంలో చిక్కుకుంది. స్థానికుల సాయంతో ద్విచక్రవాహనం నుంచి పామును బయటికి తీసి చంపేశారు.
http://10.10.50.85:6060///finalout4/andhra-pradesh-nle/finalout/03-September-2021/12954710_mmm.jpg