వరదల కారణంగా తూర్పుగోదావరి పి.గన్నవరం కే.ఏనుగుపల్లి లంకలో శ్రీనివాసరావు పాముకాటుకు గురయ్యాడు. ఇంటి చుట్టూ వరద చేరింది. తెల్లవారుజామున ఇంట్లోకి ప్రవేశించిన పాము శ్రీనివాసరావును కాటేసింది. గన్నవరం ఆసుపత్రిలో చికిత్స అందించి మెరుగైన చికిత్స కోసం అమలాపురం ఏరియా ఆస్పత్రికి తరలించారు. వరదల కారణంగా గ్రామాల్లోకి పాములు ప్రవేశిస్తున్నాయని ప్రజలు ఆందోళన చెందుతున్నారు.
వరదల వేళ పాములతో వణికిపోతున్న ప్రజలు - snake bitten on man
వరదల కారణంతో పాములు ఇళ్లలోకి వచ్చి చేరుతున్నాయి. పి.గన్నవరం కే.ఏనుగుపల్లి లంకలో ఓ వ్యక్తి పాముకాటుకు గురైయ్యాడు. అతని పరిస్థితి విషమంగా ఉండటంతో మెరుగైన చికిత్స కోసం అమలాపురం ఏరియా ఆసుపత్రికి తరలించారు.
![వరదల వేళ పాములతో వణికిపోతున్న ప్రజలు](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-4395028-876-4395028-1568113921104.jpg)
పాముకాటుతో శ్రీనివాసరావు
కే.ఏనుగుపల్లిలో పాముకాటుకు గురైన వ్యక్తి