తూర్పుగోదావరి జిల్లా అయినవిల్లి మండలం శానపల్లిలంకలో ఈనెల 14న కిడ్నాపైన బాలిక కేసును పోలీసులు ఛేదించారు. చిన్నారి(సంయుక్త) అపహరణకు పాల్పడిన బాలిక తల్లి వెంకటలక్ష్మితో సహా ఆరుగురిని అమలాపురం పోలీసులు అరెస్టు చేశారు. వెంకటలక్ష్మి, రవితేజ మధ్య మనస్పర్థలు ఉండడంతో సంయుక్త తండ్రి వద్ద ఉంటోంది. ఎలాగైనా సంయుక్తను తన వెంట తీసుకువెళ్లాలనే ప్రయత్నంలో... వెంకటలక్ష్మి ఈ దురాగతానికి పాల్పడింది.
బాలిక కిడ్నాప్ కేసు ఛేదన... ఆరుగురు అరెస్టు - east godavari district crime news
తూర్పుగోదావరి జిల్లా శానపల్లిలంకలో కిడ్నాప్‌కు గురైన బాలికను పోలీసులు రక్షించారు. విజయవాడలో చిన్నారిని అదుపులోకి తీసుకుని, అపహరణకు పాల్పడిన ఆరుగురు నిందితులను అరెస్టు చేశారు.
బాలిక కిడ్నాప్ కేసు ఛేదన