తూర్పుగోదావరి జిల్లా రంపచోడవరం మండలం సీతపల్లివాగు ఉద్ధృతికి ఓ గిరిజన యువకుడు కొట్టుకుపోయాడు. ఎడతెరిపిలేని వర్షానికి వాగు ఉద్ధృతంగా ప్రవహిస్తుండటంతో.. చేపలు పట్టేందుకు వెళ్లిన యువకుడు కొట్టుకుపోయాడు. చెట్టును పట్టుకుని ప్రాణాపాయస్థితిలో ఉన్న యువకుడిని స్థానికుల సమాచారం మేరకు పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది, బందమామిడి గ్రామస్థులు కాపాడారు.
LIVE VIDEO: చేపలు పట్టేందుకు వెళ్లి వాగులో కొట్టుకుపోతున్న అతనిని.. - సీతపల్లి వాగులో కొట్టుకుపోయిన గిరిజన యువకుడు
చేపలు పట్టేందుకు వెళ్లిన ఓ గిరిజన యువకుడు ప్రమాదవశాత్తు వాగులో కొట్టుకుపోయాడు. వాగు మధ్యలో ఓ చెట్టుని పట్టుకుని ప్రమాదకరస్థితిలో ఉన్న అతనిని పోలీసులు, అగ్నమాపక సిబ్బంది కాపాడారు. ఈ ఘటన తూర్పుగోదావరి జిల్లా రంపచోడవరం మండలంలో చోటు చేసుకుంది.
LIVE VIDEO: సీతపల్లి వాగులో కొట్టుకుపోయిన గిరిజన యువకుడు