కాకినాడలో 'ఈనాడు - సిరి' మదుపర్ల సదస్సు - Siri Maduparla Conference today in Kakinada
కాకినాడ శ్రీ సత్య ఫంక్షన్ హల్లో సిరి ఇన్వెస్టర్స్ క్లబ్, ఆదిత్య బిర్లా సన్‌లైఫ్ మ్యూచువల్ ఫండ్, జెన్‌మనీ సంయుక్త ఆధ్వర్యంలో 'ఈనాడు - సిరి' మదుపర్ల సదస్సు నిర్వహించారు.
ప్రతీ వ్యక్తి తన సంపాదనలో మదుపు ప్రణాళిక చేపట్టాలని కాకినాడలో నిర్వహిచిన 'ఈనాడు - సిరి' మదుపర్ల సదస్సులో నిపుణులు తెలిపారు. శ్రీసత్య ఫంక్షన్ హాల్లో 'ఈనాడు - సిరి' ఇన్వెస్టర్స్ క్లబ్, ఆదిత్య బిర్లా సన్‌లైఫ్ మ్యూచువల్ ఫండ్, జెన్‌మనీ సంయుక్త ఆధ్వర్యంలో ఈ సదస్సు నిర్వహించారు. ఆదిత్య బిర్ల సన్‌లైఫ్ మ్యూచువల్ ఫండ్ రీజనల్ మేనేజర్ బి.రాజేంద్ర, జెన్‌మనీ ఏరియా మేనేజర్ జి.కె శ్రీనివాస్ ఈ కార్యక్రమంలో పాల్గొని పలు సూచనలు చేశారు. స్టాక్ మార్కెట్లపై ఆర్ధిక మాంద్య ప్రభావం, బడ్జెట్ ముఖ్యాంశాలు అనే విషయంపై మదుపరులకు అవగాహన కల్పించారు. ఆర్ధిక ప్రణాళిక చేపట్టడం ద్వారా సంపదను వృద్ధి చేసుకొని జీవితాన్ని ఆనందంగా గడపవచ్చని పేర్కొన్నారు. మదుపర్లు నిపుణుల విలువైన సలహాలు స్వీకరించారు. ఈ కార్యక్రమంలో రాజమహేంద్రవరం ఈనాడు యూనిట్ ఇంచార్జ్ చంద్రశేఖరప్రసాద్ పాల్గొన్నారు.