తూర్పుగోదావరి జిల్లా పి. గన్నవరం నియోజకవర్గంలోని జీ పెదపూడి పాఠశాలలో 49 మంది విద్యార్థులు ఉన్నారు. ఉన్న ఇద్దరు ఉపాధ్యాయులలో ఒకరిని బూరుగులంకలోని పాఠశాలకు డిప్యుటేషన్‌పై పంపించారు. దీనితో 49 మంది విద్యార్థులకు ఒక్క టీచరే పాఠాలు చెప్పాల్సి వస్తోంది. బూరుగులంక పాఠశాలలో పనిచేస్తున్న ఉపాధ్యాయుని సెలవులో ఉండడంతో జీ పెదపూడి నుంచి అక్కడకు డిప్యుటేషన్‌పై ఉపాధ్యాయుని పంపించారు. వెంటనే ఉపాధ్యాయులను నియమించాలని విద్యార్థుల తల్లిదండ్రులు కోరుతున్నారు.
49మంది విద్యార్థులు.. ఒకే ఒక్క టీచర్ ! - single teacher schools in east godavari dist
ప్రభుత్వం పాఠశాల ద్వారా మెరుగైన విద్యనందిస్తామంటున్న పాలకుల హామీలు మాటలకే పరిమితమయ్యాయి. కనీసం ఉపాధ్యాయుల కొరతను తీర్చలేకపోతున్నారని తల్లిదండ్రులు వాపోతున్నారు. తూర్పుగోదావరి జిల్లా పెదపూడి పాఠశాలలో 49మంది విద్యార్థులకు ఒక్కరే టీచర్ ఉన్నారంటే పరిస్థితి ఎంత దారుణంగా ఉందో అర్థమవుతోంది.
49మంది విద్యార్థులకు పాఠాలు చెపుతున్న టీచర్