ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

రాజానగరంలో సిమ్యులేషన్ జాతీయ సమ్మేళనం - సిముల్‌కాన్‌ జాతీయ సమ్మేళనం వార్తలు

తూర్పుగోదావరి జిల్లా రాజానగరం జీఎస్ఎల్ వైద్య కళాశాలలో సిముల్‌కాన్‌ పేరుతో మెడికల్ సిమ్యులేషన్ జాతీయ సమ్మేళనం నిర్వహించారు. ఆప్తమాలజీ, ఎండోస్కోపి, హెల్లొగ్లస్, అల్ట్రాసౌండ్ పరికరాలతో మానవ శరీరంపై చికిత్సావగాహన కల్పించారు.

simulconi national  conference at  rajanagaram in east godavari district
ఎలక్ట్రానిక్ మనిషి పై చికిత్స వివరాలను వివరిస్తున్న వైద్యురాలు

By

Published : Dec 14, 2019, 12:22 PM IST

రాజానగరంలో సిమ్యులేషన్ జాతీయ సమ్మేళనం

సిముల్‌కాన్‌ పేరుతో రెండు రోజులపాటు నిర్వహించనున్న జాతీయ సమ్మేళనం... తూర్పుగోదావరి జిల్లా రాజానగరంలోని జీఎస్‌ఎల్‌ వైద్య కళాశాలలో ప్రారంభమైంది. కాలానికి అనుగుణంగా వైద్యరంగంలో మార్పులు, రోగి భద్రత ధ్యేయంగా భారత వైద్య మండలి సిములేషన్ వ్యవస్థను తీసుకొచ్చింది. జీఎస్ఎల్ వైద్య కళాశాలలో సిముల్ కన్ పేరుతో మెడికల్ సిమ్యులేషన్ నిర్వహించారు.

శరీరంలోని వివిధ అవయవాలకు సంబంధించి సాంకేతిక విజ్ఞానంతో చేపట్టబోయే వైద్య విధానాలను... సిమ్యులేటర్ల ద్వారా వైద్యులు అవగాహన కల్పించారు. వ్యాధిగ్రస్తులైన వారి లక్షణాలు, ప్రవర్తన ఎలా ఉంటాయో.... ఆప్తమాలజీ, ఎండోస్కోపి, హెల్లొగ్లస్, అల్ట్రాసౌండ్, తదితర పరికరాలతో చికిత్స విధానాలను వివరించారు.

ఈ కార్యక్రమంలో యూకే సిమ్యులేషన్‌ సొసైటీ అధ్యక్షురాలు ఎం.పూర్వ, యూకే సర్జన్‌ ఎన్‌.ఎస్‌.మూర్తి, ఆమండా విల్‌ఫోల్డ్‌, మలేషియా నిపుణుడు నరేంద్రియన్‌ కృష్ణస్వామి, ఇస్మాయిల్‌ సైబూన్‌, జీఎస్‌ఎల్‌ సిమ్యులేషన్‌ లేబొరేటరీ డైరెక్టర్‌ డా.గన్ని సందీప్‌, వైద్య కళాశాల ఛైర్మన్‌ గన్ని భాస్కరరావు, డీన్‌ వై.వి.శర్మ, ప్రిన్సిపల్‌ గురునాథ్‌, మెడికల్‌ సూపరింటెండెంట్‌ టీవీఎస్‌పీ మూర్తి పాల్గొన్నారు.

ఇదీచూడండి.క్లాక్ టవర్ కూల్చివేతపై తెదేపానేతల ఆగ్రహం

ABOUT THE AUTHOR

...view details