తూర్పు గోదావరి జిల్లా పి. గన్నవరం నియోజకవర్గంలోని నాగుల్లంక జడ్పీ ఉన్నత పాఠశాల అభివృద్ధి పనులను ఎమ్మెల్యే కొండేటి చిట్టిబాబు పరిశీలించారు. సుమారు 60 లక్షల రూపాయల నిధులతో జరుగుతున్న పనులు.. నాణ్యతా ప్రమాణాలతో నిర్వహించాలని ఇంజనీరింగ్ అధికారులకు స్పష్టం చేశారు. నియోజకవర్గంలో ప్రతి పాఠశాల కార్పొరేట్ స్థాయిలో అభివృద్ధి చెందుతాయని ఎమ్మెల్యే చిట్టిబాబు పేర్కొన్నారు. నాడు-నేడు నిధుల ద్వారా పాఠశాలలు అభివృద్ధి చెందుతున్నాయన్నారు.
'నాడు-నేడు నిధులతో పాఠశాలల్లో గణనీయమైన అభివృద్ధి' - పి గన్నవరం వార్తలు
నాడు-నేడు నిధుల ద్వారా పి. గన్నవరం నియోజకవర్గంలోని పలు పాఠశాలల్లో గణనీయమైన అభివృద్ధి పనులు జరుగుతున్నాయని ఎమ్మెల్యే కొండేటి చిట్టిబాబు అన్నారు.
'నాడు నేడు నిధులతో పాఠశాలలకు గణనీయమైన అభివృద్ధి'