తూర్పుగోదావరి జిల్లా పి.గన్నవరం నియోజకవర్గం అయినవిల్లిలోని శ్రీ సిద్ధివినాయకుడి పాదాల వద్ద లక్ష కలములతో వేద పండితులు పూజలు నిర్వహించారు. విద్యార్థులకు ఉన్నత భవిష్యత్తు కలగాలని ఆకాంక్షిస్తూ.. దేవస్థానం ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది. ఈ పూజలో ఆలయ కార్యనిర్వాహణాధికారి పీపీవీవీ సత్య నారాయణ దంపతులు పాల్గొన్నారు. ఈ నెల 17న కలములను విద్యార్థులకు పంపిణీ చేస్తామని ఆలయ అధికారులు వెల్లడించారు.
అయినవిల్లి సిద్ధి వినాయకుడి పాదాల చెంత లక్ష కలముల పూజ - తూర్పు గోదావరి తాజా న్యూస్
తూర్పుగోదావరి అయినవిల్లిలో కొలువుదీరిన శ్రీసిద్ధి వినాయకుడి పాదాల చెంత లక్ష కలములను ఉంచి వేదపండితులు పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆలయ కార్యనిర్వాహణాధికారి దంపతులు పాల్గొన్నారు.
![అయినవిల్లి సిద్ధి వినాయకుడి పాదాల చెంత లక్ష కలముల పూజ siddhi-vinayaka-is-worshiped-at-ainavilli-in-east-godavari-with-lakhs-of-pens-on-his-feet](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-10653882-419-10653882-1613490319357.jpg)
అయినవిల్లి సిద్ధి వినాయకుడు పాదాల చెంత లక్ష కలములతో పూజ