ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

ఎస్సై మానవత్వం..మతిస్థిమతం లేని వ్యక్తికి సాయం - తూర్పుగోదావరి జిల్లా తాజా వార్తలు

మతిస్థిమితం లేక.. మురుగు కాలువలో నీళ్లు తాగుతున్న వ్యక్తికి ఓ పోలీసు సాయం చేశారు. స్నానం చేయించి.. భోజనం పెట్టించి మనోవికాస కేంద్రానికి తరలించారు.

SI vasu helpe to insane man at Balabhadrapuram, Bikkavolu Mandalam, East Godavari District
SI vasu helpe to insane man at Balabhadrapuram, Bikkavolu Mandalam, East Godavari District

By

Published : Jun 1, 2020, 1:46 PM IST

తూర్పుగోదావరి జిల్లా బిక్కవోలు మండలం బలభద్రపురం గ్రామంలో గత కొంతకాలంగా మతిస్థిమితం లేని వ్యక్తి సంచరిస్తున్నాడు. గ్రామస్థులు ఏదైనా ఆహారం పెడితే తిని.. మురుగు కాల్వలో నీరు తాగుతూ జీవిస్తున్నాడు. విషయం తెలుసుకున్న బిక్కవోలు ఎస్తై వాసు... అపరిశుభ్రంగా ఉన్న వ్యక్తిని శుభ్రం చేయించి.. ఆరు జతల బట్టలు, ఆహార పదార్ధాలు అందించారు.

అనంతరం కాకినాడ ఉమా మనోవికాస కేంద్రానికి బాధితుడిని తరలించారు. ఎస్సై వాసు చేసిన పనిని ప్రతి ఒక్కరూ అభినందిస్తున్నారు.

ఇదీ చదవండి:రైతులను భయపెడుతున్న మిడత..!

ABOUT THE AUTHOR

...view details