తూర్పుగోదావరి జిల్లా ఏలేశ్వరం మండలం అప్పన్నపాలెం వద్ద కాజ్ వే వంతెన ఏలేరు వరద నీటి ఉద్ధృతికి కుంగిపోయింది. బ్రిడ్జ్ కుంగిపోవటంతో ఏలేశ్వరం నుంచి జగ్గంపేట మండలంలోని మామిడాడ, ఇర్రిపాక, మర్రిపాక, నరేంద్రపట్నం గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. కుంగిన వంతెనను ఎమ్మెల్యే పర్వత ప్రసాద్, కలెక్టర్ మురళీధర్ రెడ్డి పరిశీలించారు. నీటి ఉద్ధృతి తగ్గాక....చర్యలు చేపట్టాలని అధికారులకు కలెక్టర్ ఆదేశాలు జారీ చేశారు.
ఏలేరు నది ఉద్ధృతికి కుంగిన వంతెన - eleshwaram news
ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకి, ఎగువ నుంచి వస్తున్న వరద కారణంగా తూర్పుగోదావరి జిల్లాలోని ఏలేరు నది ఉద్ధృతంగా ప్రవహిస్తోంది. ఈ వరద ధాటికి అప్పన్నపాలెం వద్ద గల కాజ్ వే వంతెన కుంగిపోయింది.
కుంగిన వంతెనను పరిశీలిస్తున్న అధికారులు