ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

'రాజ్యాధికారం బహుజనులకు అందనంత దూరంలో ఉంది' - కాకినాడ తాజా వార్తలు

రాష్ట్రంలో రాజ్యాధికారం బహుజనులకు అందనంత దూరంలో ఉందని.. దాన్ని సాధించుకునేందుకు యువత ముందుకు రావాలని హైకోర్టు న్యాయవాది, జై భీమ్ యాక్సిస్ జస్టిస్ అధ్యక్షుడు శ్రావణ్ కుమార్ అభిప్రాయపడ్డారు.

జై భీమ్ యాక్సిస్ జస్టిస్ అధ్యక్షుడు శ్రావణ్ కుమార్
జై భీమ్ యాక్సిస్ జస్టిస్ అధ్యక్షుడు శ్రావణ్ కుమార్

By

Published : Mar 28, 2021, 6:08 PM IST

రాష్ట్రంలో రాజ్యాధికారం బహుజనులకు అందనంత దూరంలో ఉందని హైకోర్టు న్యాయవాది, జై భీమ్‌ యాక్సిస్‌ జస్టిస్‌ అధ్యక్షుడు శ్రావణ్‌ కుమార్‌ వ్యాఖ్యానించారు. రాజ్యాధికారం సాధించుకునేందుకు యువత ముందుకు రావాలని శ్రావణ్ కుమార్ కాకినాడలో నిర్వహించిన కార్యక్రమంలో కోరారు. తమపై సామాజికంగా, ఆర్థికంగా జరుగుతున్న దాడుల్ని ఎదుర్కోలేని పరిస్థితుల్లో రాష్ట్రంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలు ఉన్నారని అభిప్రాయపడ్డారు.

వైకాపా ప్రభుత్వం బీసీల్ని కార్పొరేషన్ల పేరిట విడగొట్టి ఒక్క రూపాయి కూడా రుణాలు ఇవ్వలేదని శ్రావణ్‌ కుమార్‌ ఆరోపించారు. బహుజనుల్లో చైతన్యం తీసుకొచ్చేందుకు వచ్చే నెల 14న అంబేడ్కర్ జయంతి రోజున గుంటూరులో భారీ బహిరంగ సభ నిర్వహిస్తున్నామని చెప్పారు. జై భీమ్ సమరభేరి బహరంగ సభను జయప్రదం చేయాలంటూ బైక్ ర్యాలీ నిర్వహించారు. ఆ సభలో రాజకీయ ఓ ప్రకటన చేస్తామని ఆయన స్పష్టం చేశారు.

ఇవీ చదవండి

సుముద్రంలో ఈత కొడుతుండగా విద్యార్థి గల్లంతు.. మృతి

ABOUT THE AUTHOR

...view details