ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

రాజమహేంద్రవరంలో తెరుచుకున్న దుకాణాలు - lock down latest news in rajamahendravaram

లాక్​డౌన్​ నిబంధనల సడలింపులతో తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరంలోని దుకాణాలు తెరుచుకున్నాయి. ఫలితంగా ఇంతకాలం ఇళ్లకే పరిమిత ప్రజలు దుకాణాల వద్దకు ఒక్కసారిగా తరలివచ్చారు.

జనంతో రద్దీగా మారిన రాజమహేంద్రవరం మెయిన్​ రోడ్లు
జనంతో రద్దీగా మారిన రాజమహేంద్రవరం మెయిన్​ రోడ్లు

By

Published : May 5, 2020, 3:34 PM IST

రాజమహేంద్రవరంలో దుకాణాలు ఈరోజు తెరుచుకున్నాయి. నిన్న మెయిన్‌ రోడ్డులోని షాపులు తెరిచేందుకు పోలీసులు అనుమతించలేదు. ఛాంబర్‌ ప్రతినిధులు, అధికారులతో చర్చించిన అనంతరం అనుమతి ఇవ్వటంతో ఈరోజు షాపులు తెరుచుకున్నాయి.

నగరంలోని దేవీచౌక్‌, దానవాయిపేట, మెయిన్‌రోడ్డు తదితర ప్రాంతాల్లో లాక్‌డౌన్‌ సడలింపుల మేరకు దుకాణాలు అందుబాటులోకి వచ్చాయి. ఫలితంగా ఇన్ని రోజులుగా లాక్‌డౌన్‌ నిబంధనలు ఉండటంతో ఇళ్లకే పరిమితమైన ప్రజలు దుకాణాలు వద్దకు పరుగులు తీశారు. ఉదయం పూట రహదారులు రద్దీగా మరాయి.

ఇదీ చూడండి:40 రోజుల ప్రశాంతతను పోగొట్టారంటూ మహిళల ధర్నా

ABOUT THE AUTHOR

...view details