ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

కర్ఫ్యూ కంటే ముందే అక్కడ దుకాణాలన్నీ క్లోజ్! - east godavari dst grossaries shops news

కరోనా వైరస్ పై అధికారులు, పోలీసుల నియంత్రణే కాదు.. మార్పు మనలోనూ రావాలి అంటున్నారు తూర్పుగోదావరి జిల్లాలోని వ్యాపారులు. ప్రభుత్వం అన్ని దుకాణాలను 7 గంటల వరకు తెరచుకోవచ్చని అనుమతి ఇచ్చినప్పటికీ.. ఇక్కడ మాత్రం మధ్యాహ్నం 1 వరకే తెరిచి ఉంచుతున్నారు.

shops in east godavri dst were closed before the  curfew timings
shops in east godavri dst were closed before the curfew timings

By

Published : May 6, 2020, 7:19 PM IST

తూర్పు గోదావరి జిల్లా కోనసీమ ప్రాంతంలో దుకాణదారులు ఆదర్శవంతమైన నిర్ణయం అమలు చేస్తున్నారు. మధ్యాహ్నం ఒంటి గంట వరకే మాత్రమే దుకాణాలు తెరిచి ఉంచుతున్నారు. జిల్లాలోని మలికిపురం రాజోలు తాటిపాకలో ఈ విధానాన్ని అనుసరిస్తున్నారు.

అమలాపురంలో సాయంత్రం నాలుగు గంటల వరకు ఉంచుతున్నారు. రాత్రి 7 గంటల వరకు దుకాణాలను తెరిచి ఉంచటం వల్ల కరోనా వైరస్ వ్యాప్తి చెందడానికి అవకాశం ఉంటుందని అభిప్రాయపడుతున్నారు. లాక్ డౌన్ ఉన్నంతకాలం ఇదే విధానాన్ని అమలు చేస్తామని చెప్పారు.

ABOUT THE AUTHOR

...view details