ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

భారీగా వర్షాలు..పోటెత్తుతున్న మురుగు కాలువలు - కోనసీమలో భారీ వర్షాలు

కోనసీమలో కురుస్తున్న భారీ వర్షాలకు మురుగు కాలువలు పొంగి ప్రవహిస్తున్నాయి. వీటి నుంచి ముంపు నీరు అవుట్​ ఫాల్స్​ స్లూయిజ్​​ల ద్వారా గోదావరిలో అత్యంత వేగంగా కలుస్తోంది. అక్కడ జల ప్రవాహం జిల్లాలో వానల ప్రభావాన్ని తెలియజేస్తోంది.

Sewers are overflowing due to heavy rains in Konaseema.
పోటెత్తుతున్న మురుగు కాలువలు

By

Published : Sep 14, 2020, 2:48 PM IST


ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు తూర్పుగోదావరి జిల్లా కోనసీమ ప్రాంతంలోని మురుగు కాలువలు పొంగి ప్రవహిస్తున్నాయి. వర్షపు నీరు మురుగు కాలువల్లోకి చేరి వాటికి అనుసంధానంగా ఉన్న అవుట్ ఫాల్స్​ స్లూయిజ్​ ద్వారాా ముంపు నీరు గోదావరి నది పాయలో కలుస్తోంది. కోనసీమలో గోరింకల, అప్పర్ కౌశిక్, లోయర్ కౌశిక్ దేశికుడు, దసరా బుల్లోడు వంటి ప్రధాన మురుగు కాలువలు... వాటికి అనుబంధంగా మధ్య, చిన్న తరహా రెవెన్యూ మురుగు కాలువలు ఉన్నాయి. అధిక వర్షాలకు ఈ మురుగు కాలువలు అన్నీ పోటెత్తి జోరుగా ప్రవహిస్తున్నాయి.

ABOUT THE AUTHOR

...view details