ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

గజగజ వణుకుతున్న తెలంగాణ.. 6 డిగ్రీలు కంటే తక్కువ ఉష్ణోగ్రత నమోదు - cold wave in telangana

Temperature drop in Telangana today: శీతలగాలుల కారణంగా తెలంగాణ రాష్ట్రంలో చలి తీవ్రత రోజురోజుకూ పెరుగుతోంది. పలు ప్రాంతాల్లో ఉష్ణోగ్రత సాధారణం కన్నా 4 నుంచి 6 డిగ్రీలు తక్కువగా నమోదవుతోంది. ఆదివారం తెల్లవారుజామున రాష్ట్రంలోకెల్లా అత్యల్పంగా కుమురం భీం జిల్లా సిర్పూరు(యు)లో 7.3, ఆదిలాబాద్‌లో 9.2, మెదక్‌లో 10, హైదరాబాద్‌ శివారు నందనవనంలో 11.7 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ప్రస్తుత సీజన్‌లో ఇంత తక్కువ ఉష్ణోగ్రతలు నమోదవడం ఇదే తొలిసారి.

గజగజ వణుకుతున్న తెలంగాణ
గజగజ వణుకుతున్న తెలంగాణ

By

Published : Nov 21, 2022, 10:24 AM IST

Temperature drop in Telangana today: తెలంగాణ రాష్ట్రంలో గత పదేళ్లలో నవంబరు నెలలో అత్యల్ప ఉష్ణోగ్రత 6.8 డిగ్రీలు. ఆదిలాబాద్‌లో 2017లో ఇది నమోదైంది. ఈ ఏడాది ఆ రికార్డు చెరిగిపోయి ఇంకా తక్కువ ఉష్ణోగ్రత నమోదయ్యే సూచనలున్నాయని అంచనా. ప్రస్తుతం పగటి ఉష్ణోగ్రతలు సైతం పడిపోతున్నాయి. ఆదివారం పగలు భద్రాచలంలో 27, హైదరాబాద్‌లో 28 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఇవి సాధారణంకన్నా 4 డిగ్రీలు తక్కువ. ఉత్తర, ఈశాన్య భారత ప్రాంతాల నుంచి తక్కువ ఎత్తులో తెలంగాణలోకి గాలులు వీస్తున్నందున ఉష్ణోగ్రతలు పడిపోయి చలి తీవ్రత పెరుగుతోందని వాతావరణశాఖ రాష్ట్ర అధికారి శ్రావణి ‘ఈనాడు’కు తెలిపారు. ఆకాశంలో మేఘాలు పెద్దగా లేనందున రాత్రిపూట భూవాతావరణం త్వరగా చల్లబడి శీతలగాలులు వీస్తున్నాయి.

నేడు, రేపు ఓ మోస్తరు వర్షాలు:సోమ, మంగళవారాల్లో తెలంగాణలో అక్కడక్కడ ఓ మోస్తరు వర్షాలు కురిసే సూచనలున్నట్లు వాతావరణశాఖ తెలిపింది. తెల్లవారుజామున రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో పొగమంచు కురుస్తోంది. అనారోగ్యంతో బాధపడేవారు ఉదయంపూట ఎండరాక ముందు బయట తిరగడం మంచిదికాదని, ఆరోగ్యపరంగా జాగ్రత్తలు తీసుకోవాలని శ్రావణి సూచించారు.



ఇవీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details