టైరు పేలి మరో కారును ఢీకొట్టిన కారు - సీసీ టీవీ దృశ్యాలు Today Road Accidents :తూర్పు గోదావరి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటన దేవరపల్లి మండల పరిధిలోని బంధపురం వద్ద చోటు చేసుకుంది. పూర్తి వివరాల్లోకి వెళితే, జాతీయ రహదారిపై ఎన్టీఆర్ జిల్లా నందిగామ నుంచి విశాఖ వెళ్తున్న కారు టైరు పేలి డివైడర్ని ఢీ కొట్టి అవతల వైపు వెళుతున్న మరో కారును ఢీకొట్టడంతో ఈ దుర్ఘటన చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో విశాఖ నుంచి హైదరాబాద్ వెళ్తున్న కారులో ప్రయాణిస్తున్న అత్తాకోడలు రమాదేవి, రమ్యతో పాటు 19 నెలల చిన్నారి గనిష్క ప్రాణాలు కోల్పోయారు. గాయపడిన మరో 8 మందిని కొవ్వూరు, దేవరపల్లి ఆస్పత్రులకు తరలించారు. ప్రమాదం జరిగిన సమయంలో అటుగా వెళ్తున్న గోపాలపురం ఎమ్మెల్యే తలారి వెంకటరావు 108 సిబ్బంది, పోలీసులకు సమాచారం అందించారు. ట్రైనీ డీఎస్పీ భానోదయ, సీఐ శ్రీనివాస్ ఘటనా స్థలికి చేరుకొని విచారణ చేస్తున్నారు.
ఆగి ఉన్న లారీని ఢీకొన్న మరో వాహనం - ముగ్గురు మృతి - శబరిమల వెళ్తున్న బస్సు ఢీకొని ఒకరు
టిప్పర్ ఢీకొని: చంద్రగిరి నుంచి తిరుపతి వైపు వస్తున్న టిప్పర్ వాహనం రోడ్డు దాటుతున్న కొత్తశానంబట్లకు చెందిన జగన్నాథ రెడ్డిని ఢీకొట్టింది. ఈ ఘటనలో జగన్నాథ్ రెడ్డి దుర్మరణం పాలయ్యారు. టిప్పర్ డ్రైవర్ పరారయ్యాడు. సమాచారం అందుకున్న గ్రామస్థులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. మితిమీరిన వేగంతో టిప్పర్లు రావడంతో తరచూ ప్రమాదాలు జరుగుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. జగన్నాథ్ రెడ్డి మృతి కారణమైన టిప్పర్ డ్రైవర్ను వెంటనే అరెస్ట్ చేయాలని పూతలపట్టు-నాయుడుపేట జాతీయ రహదారిపై ధర్నా నిర్వహించారు. సీఐ రాజశేఖర్ ఆందోళన చేస్తున్న గ్రామస్థులతో చర్చించారు. టిప్పర్ డ్రైవర్ను అరెస్ట్ చేస్తామని హామీ ఇవ్వడంతో గ్రామస్థులు శాంతించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
పొగమంచు ఎఫెక్ట్, విశాఖలో వరుసగా ఢీకొన్న ఐదు వాహనాలు
తిరుపతి జిల్లా ఏర్పేడు మండలంలో కారు బీభత్సం సృష్టించింది. ఈ ప్రమాదంలో ఒకరు మృతి చెందారు. వివరాల్లోకి వెళ్తే ఏర్పేడు-వెంకటగిరి ప్రధాన రహదారిపై దుకాణాల్లోకి కారు దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో ఒకరు మృతి చెందగా, మరో ముగ్గురికి తీవ్రగాయాలయ్యాయి. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.