కోనసీమ తిరుపతిగా పేరుగాంచిన వాడపల్లి వెంకటేశ్వరస్వామి ఆలయం భక్తులతో కిక్కిరిసింది. ఏడు శనివారాల నోము నోచుకోవడానికి తూర్పు గోదావరి జిల్లా ఆత్రేయపురానికి భక్తులు పోటెత్తారు. స్వామి వారిని దర్శించుకునేందుకు రాష్ట్రం నలుమూలల నుంచి అధిక సంఖ్యలో తరలివచ్చారు. క్యూలైన్లు అన్నీ నిండిపోయాయి.
కొవిడ్ నిబంధనలు అమలు చేస్తూ.. భక్తులకు స్వామి దర్శనాన్ని కల్పించామని ఆలయ ఈవో ముదునూరి సత్యనారాయణరాజు తెలిపారు. ఏడువేల మంది స్వామిని దర్శించుకోగా.. ప్రత్యేకదర్శనం, విరాళాలు ద్వారా 5 లక్షల రూపాయల ఆదాయం వచ్చినట్లు వెల్లడించారు.