ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

నాటు సారా బట్టీలపై దాడులు.. ఏడుగురు అరెస్టు

తూర్పుగోదావరి జిల్లాలోని కొన్ని మండలాల్లో ఎక్సైజ్​ అధికారుల ఆధ్వర్యంలో సారా బట్టీలపై దాడులు జరిగాయి. పెద్ద ఎత్తున నాటు సారాను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. బెల్లం ఊటను ధ్వంసం చేశారు. ఏడుగురుని అదుపులోకి తీసుకున్నారు.

Seven members arrested
పత్తిపాడులో ఎక్సైజ్​ అధికారుల దాడులు ఏడుగురు అరెస్టు

By

Published : Jun 20, 2020, 12:44 AM IST

తూర్పుగోదావరి జిల్లా ప్రత్తిపాడు, రౌతులపూడి, కిర్లంపూడి మండలాల్లోని వివిధ గ్రామాల్లో నాటు సారా తయారీ కేంద్రాలపై ఎక్సైజ్ అధికారులు దాడులు నిర్వహించారు. బెల్లం ఊటను ధ్వంసం చేశారు. 120 లీటర్ల సారా, రెండు ద్విచక్ర వాహనాలు స్వాధీనం చేసుకున్నారు. ఏడుగురు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నామని ప్రత్తిపాడు ఎక్సైజ్​ సీఐ వెంకటరమణ తెలిపారు.

ABOUT THE AUTHOR

...view details