ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

దారుణం: రైతును చెట్టుకు కట్టేసి కొట్టిన ఏడుగురు రైతులు - రైతును కొట్టిన ఏడు మంది రైతులు

భూవివాదంలో ఓ రైతును ఏడుగురు రైతులు కలిసి చెట్టుకు కట్టేసి కొట్టిన ఘటన తూర్పుగోదావరి జిల్లా జగ్గంపేటలో మండల పరిధిలో జరిగింది. తీవ్రంగా గాయపడిన బాధితుడిని మెరుగైన వైద్యం కోసం కాకినాడకు తరలించారు. ఈ వ్యవహారంపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Seven farmers
Seven farmers

By

Published : Aug 3, 2020, 8:06 PM IST

దారుణం: రైతును చెట్టుకు కట్టేసి కొట్టిన ఏడుగురు రైతులు

తూర్పుగోదావరి జిల్లా జగ్గంపేట మండలం గొల్లలగుంటలో దారుణం చోటు చేసుకుంది. ఓ రైతుని చెట్టుకి కట్టేసి ఏడుగురు రైతులు విచక్షణారహితంగా కొట్టడం తీవ్ర సంచలనం కలిగించింది. రైతు శ్రీనివాస్‌రెడ్డి, మిగతా రైతుల మధ్య భూవివాదం ఉంది. తరచూ బాధిత రైతు, మిగతా రైతుల మధ్య గొడవ జరుగుతోంది. ఈ క్రమంలో ఇవాళ ఉదయం తీవ్ర వాగ్వాదం జరిగింది. మధ్యాహ్నం శ్రీనివాస్‌రెడ్డి పొలంలో ఉండగా ఒకే కుటుంబానికి చెందిన ఏడుగురు వ్యక్తులు చెట్టుకు కట్టేసి శ్రీనివాస్‌రెడ్డిని తీవ్రంగా కొట్టారు. శరీరమంతా గాయపర్చారు. సమాచారం అందుకున్న జగ్గంపేట పోలీసులు ఘటనాస్థలానికి చేరుకున్నారు. బాధితుడికి స్థానికంగా ప్రాథమిక వైద్యం అందించారు. అనంతరం కాకినాడకు తరలించారు. ఈ వ్యవహారంపై జగ్గంపేట పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

ABOUT THE AUTHOR

...view details