తూర్పుగోదావరి జిల్లా అమలాపురం డివిజన్‌లో వరుస చోరీలతో ప్రజలు ఆందోళనకు గురవుతున్నారు. ఆరు నెలల క్రితం పీ.గన్నవరం మండలంలోని పలు గ్రామాల్లో చోరీ జరిగింది. ఈ నెల 24న పోతవరంలోని ఓ ఇంట్లో 70 కాసుల బంగారు ఆభరణాలు, రెండు కిలోల వెండి సామగ్రి చోరీకి గురయ్యాయి.
అమలాపురంలో వరుస చోరీలు.. భయాందోళనలో స్థానికులు
తూర్పుగోదావరి జిల్లా అమలాపురం డివిజన్‌లో వరుస చోరీలు జరుగుతున్నాయి. దీంతో ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు.
అమలాపురం మండలం కే.అగ్రహారంలో నడిచి వెళ్తున్న మహిళ మెడలోంచి 16 కాసుల బంగారు ఆభరణాన్ని దొంగలించుకుపోయారు. పోలీసులకు ఫిర్యాదు చేసినా.. వారినుంచి ఎటువంటి సమాచారమూ లేదని బాధితులు చెబుతున్నారు. ఇళ్లలో చోరీకి పాల్పడిన దొంగలు ఆనవాళ్లు దొరక్కుండా.. కారం చల్లుతున్నట్లు పోలీసులు తెలిపారు. కోనసీమ ప్రాంతంలో దొంగలను పట్టుకునేందుకు ఇటీవల ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేశామని డీఎస్పీ మాధవ రెడ్డి తెలిపారు.
ఇదీ చదవండి:Theft: బంగారం దుకాణంలో చోరీ.. భారీగా నగలు, నగదు అపహరణ