తూర్పుగోదావరి జిల్లా చింతూరు నుంచి మైదాన ప్రాంతానికి అక్రమంగా తరలిస్తున్న 15 టన్నుల రేషన్ బియ్యాన్ని రంపచోడవరం మండలం పోక్స్ పేట వద్ద విజిలెన్స్ అధికారులు పట్టుకున్నారు. రేషన్ కార్డుల ద్వారా ప్రతి నెల సరఫరా చేసే బియ్యం బస్తాలను చింతూరు నుంచి రాజమహేంద్రవరం తరలిస్తుండగా.. ముందస్తు సమాచారంతో విజిలెన్స్ అధికారులు దాడులు జరిపారు. బియ్యం లారీతో పాటు కొంతమంది వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు. ఈ బియ్యాన్ని ఎవరు తరలిస్తున్నారు అనే విషయంపై దర్యాప్తు చేస్తున్నట్లు అధికారులు తెలిపారు.
అక్రమంగా తరలిస్తున్న బియ్యం పట్టివేత - అక్రమంగా తరలిస్తున్న బియ్యం పట్టివేత
లారీలో అక్రమంగా తరలిస్తున్న రేషన్ బియ్యాన్ని తూర్పుగోదావరి జిల్లా చింతూరులో విజిలెన్స్ అధికారులు పట్టుకున్నారు. ఈ బియ్యాన్ని ఎవరు తరలిస్తున్నారే విషయంపై దర్యాప్తు చేస్తున్నట్లు అధికారులు తెలిపారు.

అక్రమంగా తరలిస్తున్న బియ్యం పట్టివేత