ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

అక్రమంగా గోవులను తరలిస్తున్న కంటైనర్ల పట్టివేత

అక్రమంగా పశువుల్ని తరలిస్తున్న కంటైనర్లను పోలీసులు..శంఖవరం మండలం కత్తిపూడి జాతీయ రహదారిపై పట్టుకున్నారు. పది మందిని అదుపులోకి తీసుకున్నారు. పశువుల్ని కృష్ణునిపాలెం గోశాలకు తరలించారు.

పశువులు
పశువులు

By

Published : Aug 26, 2021, 2:07 PM IST

తూర్పు గోదావరి జిల్లా శంఖవరం మండలం కత్తిపూడి వద్ద జాతీయ రహదారిపై ఒడిశా నుంచి చిలకలూరిపేటకు పశువులను అక్రమంగా తరలిస్తున్న 7 కంటైనర్లను ఎస్​బీ పొలీసులు స్వాధీనం చేసుకున్నారు.

కంటైనర్లలో 64 ఆవులు, 72 గేదెలు ఉన్నాయని పొలీసులు తెలిపారు. వీటిని అన్నవరం పోలీస్ స్టేషన్​కు తరలించారు. కేసు నమోదు చేసి పది మందిని అదుపులోకి తీసుకున్నట్లు పోలీసులు తెలిపారు. అనంతరం పశువులను గోకవరం మండలంలో కృష్ణునిపాలెం గోశాలకు తరలించారు.

ఇదీ చదవండి:గండేపల్లిలో దొంగల హల్‌చల్‌.. పలు ఆలయాల్లో చోరీ

ABOUT THE AUTHOR

...view details