ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

ప్రైవేట్ బస్సులో గంజాయి పట్టివేత... ఒకరు అరెస్ట్, మరొకరు పరార్ - News of cannabis move in Kakinada

ప్రైవేట్ బస్సులో గంజాయిని తరలిస్తుండగా తూర్పుగోదావరి జిల్లా కాకినాడ పోలీసులు పట్టుకున్నారు. నిందితుల్లో ఒకరు అరెస్ట్ కాగా, మరొకరు పరారయ్యాడు. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు గంజాయిని స్వాధీనం చేసుకుని దర్యాప్తు చేపట్టారు.

ప్రైవేట్ బస్సులో గంజాయి పట్టివేత ...ఒకరి అరెస్ట్, మరొకరు పరారు
ప్రైవేట్ బస్సులో గంజాయి పట్టివేత ...ఒకరి అరెస్ట్, మరొకరు పరారు

By

Published : Mar 18, 2021, 12:28 PM IST

తూర్పు గోదావరి జిల్లా కాకినాడలో ఓ ప్రైవేట్ బస్సులో గంజాయి పట్టుబడింది. కాకినాడ నుంచి బెంగళూరుకు వెళ్తున్న బస్సులో ఇద్దరు వ్యక్తుల బ్యాగులో గంజాయి ఉన్నట్లు డ్రైవర్ గుర్తించారు.

కాకినాడ రూరల్ సర్పవరం సెంటర్ వద్ద ఆ వ్యక్తుల సంచులను తనిఖీ చేసిన బస్సు డ్రైవర్.. పోలీసులకు ఫిర్యాదు చేశారు. గంజాయిని స్వాధీనం చేసుకున్న పోలీసులు... ఒకరిని అరెస్టు చేయగా, మరొకరు పరారయ్యాడు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

ఇవీ చదవండి:

యానాం అసెంబ్లీ స్థానానికి పుదుచ్చేరి మాజీ సీఎం నామినేషన్

ABOUT THE AUTHOR

...view details