గోదావరికి వరద ప్రవాహం కొనసాగుతోంది. ధవళేశ్వరం బ్యారేజీ వద్ద రెండో ప్రమాద హెచ్చరిక అమల్లో ఉండగా... మధ్యాహ్నం 12 గంటలకు బ్యారేజీ వద్ద నీటిమట్టం 16.70 అడుగులుగా నమోదైంది. 17.35 లక్షల క్యూసెక్కుల వరద నీటిని సముద్రంలోకి వదులుతున్నారు. విలీన మండలాలతో పాటు, దేవీపట్నం, ఏజెన్సీ ప్రాంతం, కోనసీమ లంక గ్రామాలు నీటిలోనే ఉన్నాయి.
ధవళేశ్వరం వద్ద కొనసాగుతున్న రెండో ప్రమాద హెచ్చరిక
ధవళేశ్వరం బ్యారేజీ వద్ద రెండో ప్రమాద హెచ్చరిక కొనసాగుతోంది. ప్రస్తుతం నీటిమట్టం 16.70 అడుగులుగా నమోదైంది.
dowleswaram barrage