ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

మొదటి పంటే గట్టెక్క లేదు... రెండోపంటకు హెచ్చరికలంటా..!

ఓ వైపు తుపానుతో అన్నదాతకు కష్టాలు వెంటాడుతుంటే..మరోవైపు రెండో పంటను వేయాలంటూ అధికారులు హెచ్చరికలు జారీ చేస్తున్నారు. తూర్పుగోదావరి జిల్లాలో రెండో పంట 120 రోజుల్లోనే పూర్తి చేయాలంటూ ఇరిగేషన్ అధికారులు రైతును హెచ్చరిస్తున్నారు.

second crop alert at mummidivaram
తూర్పుగోదావరి జిల్లాలో రెండో పంట హెచ్చరికలు

By

Published : Nov 30, 2020, 4:27 PM IST

తూర్పుగోదావరి జిల్లాలో రెండో పంట హెచ్చరికలు

మూలిగే నక్కపై తాటిపండు పడటం అంటే ఇదే..! తూర్పుగోదావరి జిల్లాలో తుపానులు కారణంగా తొలకరి పంట గట్టెక్కకుండానే ..రెండో పంట 120 రోజుల్లోనే పూర్తి చేయాలంటూ ఇరిగేషన్ అధికారులు హెచ్చరికలు జారీచేశారు. ముమ్మిడివరం నియోజకవర్గం పరిధిలో తుపాను ప్రభావంతో కురిసిన భారీ వర్షాలకు కోతకు సిద్ధంగా ఉన్న చేలు.. కోసిన చేలు నీటిలోనే నానుతున్నాయి. పొలాల్లో నీరు బయటకు పోవాలంటే వారం పది రోజులు సమయం పడనుంది. ఇప్పుడు బస్తా గింజలు వస్తాయో లేవో అని రైతన్నలు ఆవేదన వ్యక్తం చేస్తుంటే..అధికారులు పంట వేయమంటున్నారు. పోలవరం పనులకోసం పంట కాలువలను మార్చి ఒకటో తేదీ నుంచి మూసివేయడం జరుగుతుందని .. ఇరిగేషన్ అధికారులు గ్రామాల్లో మైకుల ద్వారా తెలుపుతున్నారు. రైతులకు పంటలు వేయాలని సూచిస్తున్నారు.

పంట నష్టపోయిన ప్రతి కౌలు రైతులను ఆదుకోవాలని తెదేపాకు చెందిన సభ్యుల బృందం ప్రభుత్వాన్ని డిమాండ్ చేసింది. ముమ్మడివరం నియోజకవర్గంలో 4 మండలాల్లోని దెబ్బతిన్న వరి పొలాలను బృంద సభ్యులు పరిశీలించారు.. ప్రభుత్వం వెంటనే నష్టాన్ని అంచనా వేసి వారం రోజుల్లోనే ఒక్క ఎకరాకు 30 వేల చొప్పున పరిహారం అందించాలని కోరారు.

ఇదీ చూడండి.ప్రాణాలకు తెగించి.. వెలుగులు నింపాడు

ABOUT THE AUTHOR

...view details