తూర్పు గోదావరి జిల్లా కాకినాడలో నాటు సారా తయారీ కేంద్రంపై ఎస్ఈబీ అధికారులు దాడులు నిర్వహించారు. ఎన్ఎఫ్సీఎల్ పరిశ్రమ ప్రాంతంలో గుట్టుచప్పుడు కాకుండా నాటుసారా తయారు చేస్తున్నట్లు గుర్తించారు.
14 డ్రమ్ముల్లో నిల్వ చేసిన 2,800 లీటర్ల బెల్లం ఊటను ధ్వంసం చేశారు. రెండు గ్యాస్ సిలిండర్లు, అమ్మోనియాను స్వాధీనం చేసుకున్నారు. సారా తయారీ కేంద్రాన్ని ఎస్ఈబీ సూపరింటెండెంట్ ప్రసాద్ పరిశీలించారు.