తూర్పుగోదావరి జిల్లా గోకవరం, కోరుకొండ మండలాల్లోని నాటుసారా స్థావరాలపై ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో అధికారులు దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో 18 వందల లీటర్ల బెల్లం ఊటను ధ్వంసం చేసి, 20 లీటర్ల నాటుసారాను స్వాధీనం చేసుకున్నారు. ముగ్గురు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు. వీరిని కోర్టులో హాజరుపరుస్తామని కోరుకొండ ఎక్సైజ్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు తెలిపారు.
నాటుసారా తయారీ స్థావరాలపై పోలీసుల దాడులు - తూర్పుగోదావరి జిల్లా సారా తయారీ
తూర్పుగోదావరి జిల్లాలోని పలు గ్రామాల్లో నాటుసారా గుప్పుమంటోంది. గుట్టుచప్పుడు కాకుండా సారా కాస్తూ.. అక్రమార్కులు జేబులు నింపుకుంటున్నారు. తాజాగా గోకవరం, కోరుకొండ మండలాల్లోని సారా తయారీ స్థావరాలపై ఎస్ఈబీ అధికారులు దాడులు చేసి ముగ్గురిని అదుపులోకి తీసుకున్నారు.
![నాటుసారా తయారీ స్థావరాలపై పోలీసుల దాడులు seb officers rides on wine manufacturing plants in gokavaram, korukonda at east godavari district](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-8614834-581-8614834-1598781983439.jpg)
నాటుసారా తయారీ స్థావరాలపై పోలీసుల దాడులు