ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

International womens day: కన్నీటి  మహిళ సైకత శిల్పం... ఎక్కడంటే?

International womens day: అన్ని రంగాల్లోనూ మహిళలు ముందున్నా వారిపై ఇంకా వివక్ష మాత్రం తగ్గటంలేదని ఆవేదన చెందుతూ కన్నీరు పెట్టుకుంటున్న మహిళ సైకత శిల్పాన్ని తీర్చిదిద్దారు. తూర్పుగోదావరి జిల్లా రంగంపేటకు చెందిన ప్రముఖ సైకత శిల్పి దేవిన శ్రీనివాస్ కుమార్తెలు సోహిత, ధన్యత దీనిని రూపొందించారు.

International womens day women sculpture
అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మహిళ సైకతా శిల్పం

By

Published : Mar 7, 2022, 5:25 PM IST

అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మహిళ సైకత శిల్పం

womens day 2022: అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా.. తూర్పుగోదావరి జిల్లా రంగంపేటకు చెందిన ప్రముఖ సైకత శిల్పి దేవిన శ్రీనివాస్ కుమార్తెలు సోహిత, ధన్యత సైకత శిల్పాన్ని రూపొందించారు. అన్ని రంగాల్లోనూ మహిళలు ముందున్నా వారిపై ఇంకా వివక్ష మాత్రం తగ్గటంలేదని ఆవేదన చెందుతూ కన్నీరు పెట్టుకుంటున్న మహిళ రూపాన్ని తీర్చిదిద్దారు. అవనిలో సగం మేమే ఐనా.. మాపై వివక్షే, దయచేసి స్త్రీలను గౌరవించండి అనే నినాదాలతో రూపొందించిన సైకత శిల్పం అందరినీ ఆలోచింపజేసేలా ఉంది. పది గంటలు శ్రమించి సైకత శిల్పాన్ని రూపొందించినట్లు అక్కాచెల్లెళ్లు దేవిన సోహిత, ధన్యతలు తెలిపారు.

ABOUT THE AUTHOR

...view details