ఆంధ్రప్రదేశ్

andhra pradesh

బోటు వెలికితీతకు రంగంలోకి దిగిన స్కూబా డైవర్లు

కచ్చులూరు వద్ద గోదావరిలో మునిగిన బోటును బయటకు తీసేందుకు చర్యలు ముమ్మరం చేశారు. ధర్మాడి సత్యం బృందం ప్రయత్నాలు ఫలించకపోవటంతో స్కూబా డైవర్లు రంగంలోకి దిగారు.

By

Published : Oct 20, 2019, 10:37 AM IST

Published : Oct 20, 2019, 10:37 AM IST

స్కూబా డైవర్లు

తూర్పుగోదావరి జిల్లా కచ్చులూరు వద్ద గోదావరిలో మునిగిన పర్యాటక బోటును వెలికితీసేందుకు స్కూబా డైవర్లు రంగంలోకి దిగారు. కాకినాడ చెందిన ధర్మాడి సత్యం బృందం ఆరు రోజులుగా చేస్తున్న ప్రయత్నాలు ఫలించలేదు. పలుమార్లు లంగరు ఉచ్చు జారిపోవటంతో ధర్మాడి సత్యం విశాఖ నుంచి స్కూబా డైవర్లను దేవీపట్నం తీసుకువచ్చారు. మొదట వీరు కచ్చులూరు వెళ్లేందుకు పోలీసులు అనుమతి నిరాకరించారు. కొంతసేపటి తరువాత అనుమతి ఇచ్చారు. అధికారులు, మత్స్యకారులు కలిసి బోటును వెలికితీసే పనుల్లో నిమగ్నమయ్యారు. ఈ స్కూబా డైవర్లు నీటిలోకి వెళ్లి బోటుకు లంగర్లు తగిలించనున్నారు. దీని ద్వారా బోటు పట్టు తప్పకుండా బయటకు వచ్చే అవకాశం ఉంటుందని ధర్మాడి సత్యం బృందం భావిస్తోంది. కాగా బోటు ప్రమాదంలో 51 మంది మృతిచెందగా ఇప్పటికే 38 మృతదేహాలు లభ్యమయ్యాయి. మరో 13 మృతదేహాలు బోటులోనే ఉన్నట్టుగా అదికారులు భావిస్తున్నారు.

ABOUT THE AUTHOR

...view details