కరోనా దృష్ట్యా విద్యార్థులకు నష్టం కలగకుండా.. విద్యాశాఖ అధికారులు దూరదర్శన్ బ్రిడ్జి కోర్సు ప్రసారం చేస్తున్నారు. విద్యార్థుల సందేహాల నివృత్తి కోసం మంగళ, బుధ, శుక్రవారాల్లో ఉన్నత పాఠశాలలకు ఉపాధ్యాయులు హాజరు కావాలని విద్యాశాఖ సూచనలు జారీ చేసింది. అయితే కరోనా కేసులు పెరుగుతున్నందున తూర్పుగోదావరి జిల్లా అనపర్తితో పాటు పలు మండలాల్లో ఉపాధ్యాయులు బ్రిడ్జి కోర్సు మూల్యాంకనాన్ని బహిష్కరిస్తున్నట్లు ఉపాధ్యాయులు విద్యాశాఖాధికారులకు పత్రాలు అందజేశారు.
బ్రిడ్జీ కోర్సు మూల్యాంకనం బహిష్కరించిన ఉపాధ్యాయులు
కరోనా నేపథ్యంలో ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు అధికారులు దూరదర్శన్ బ్రిడ్జి కోర్సు ప్రసారం చేస్తున్నారు. అయితే వారి సందేహాలు నివృత్తి చేసుకునేందుకు మంగళ, బుధ, శుక్రవారాల్లో ఉన్నతపాఠశాలల ఉపాధ్యాయులు హాజరు కావాలని విద్యాశాఖ సూచనలు జారీ చేసింది. తూర్పుగోదావరి జిల్లా అనపర్తిలో కరోనా కేసులు పెరుగుతున్నందున ఉపాధ్యాయులు దీన్ని బహిష్కరించారు.
బ్రిడ్జి కోర్స్ మూల్యాంకనను బహిష్కరిస్తూ..!